హీరో గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ సినిమా చేస్తున్నారు. ఇందులో గోపీచంద్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. కోర్ట్ రూమ్ డ్రామా అంటే ఒక పర్టిక్యులర్ కేసు, దానిపై వాదనలు, అందులోనే హీరోయిక్ ఎలివేషన్స్, ఆ కేసు ద్వారానే ఒక సోషల్ మెసేజ్ అనేవి మామూలే. మారితే హీరో పాత్ర చిత్రీకరణ మారుతుంది. సో.. మొత్తంగా చూస్తే కమర్షియల్ హంగులతో తెరకెక్కే కోర్ట్ రూమ్ కథలు దాదాపు ఒకేలా అనిపిస్తాయి. ఒక సినిమాకు ఇంకో సినిమాకు మధ్యన లాంగ్ గ్యాప్ ఉంటే తప్ప పోలిక గుర్తురాకుండా చేయడం కష్టం.
అయితే గోపీచంద్ సినిమా ఈ ఇబ్బంది నుండి తప్పించుకోలేకపోయింది. కారణం పవన్ కళ్యాణ్. పవన్ రీఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం ‘వకీల్ సాబ్’. ఇందులో పవన్ లాయర్. కథ మొత్తం కోర్టులోనే జరుగుతుంది. విడుదలయ్యాక చూస్తే గోపీచంద్ చిత్రానికి ‘వకీల్ సాబ్’కు చాలానే పోలికలు కనబడ్డాయట. దీంతో డైరెక్టర్ మారుతి కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారట. ఇప్పుడెలాగూ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా సినిమాకు బ్రేక్ పడింది. ఈ ఖాళీ సమయాన్ని మారుతి చేంజెస్ చేయడానికి సద్వినియోగం చేసుకుంటున్నారట. మొత్తానికి పవన్ కారణంగా గోపీచంద్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నమాట.