పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘వకీల్ సాబ్’ ఈ నెల 9వ రిలీజ్ కానుంది. లాక్ డౌన్ అనంతరం విడుదలవుతున్న భారీ తెలుగు సినిమా ఇది. పవన్ మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. అందుకే నిర్మాత దిల్ రాజు థియేట్రికల్ హక్కుల్ని భారీ ధరలకే విక్రయించారు. సుమారు 84 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సినిమా హిట్ కావాలంటే 100 కోట్ల షేర్ తప్పనిసరి. అందుకే మొదటి వారం రోజుల్లోనే పెట్టుబడిలో సగం ఓపెనింగ్స్ రూపంలో వెనక్కి తెచ్చుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు అనుకున్నారు.
మిడ్ నైట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు ప్లాన్ చేశారు. కానీ మిడ్ నైట్ షోలకు అనుమతులు దొరకలేదు. ఎర్లీ మార్నింగ్ షోలకు పర్మిషన్ పెండింగ్లో ఉంది. వీటికి అనుమతి వస్తే రోజుకు 6 షోలు పడతాయి. అప్పుడు హిట్, ఫ్లాప్ అనే తీర్పులతో సంబంధం లేకుండా మొదటి వారంలోనే దాదాపు అభిమానులంతా సినిమాను చూసేస్తారు. డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కే అవకాశాలు పెరుగుతాయి. ఒకవేళ ఎక్స్ట్రా షోలు లేకపోతే మాత్రం లాంగ్ రన్ మీద ఆధారపడాల్సిందే. మరోవైపు లాక్ డౌన్ భయం వెంటాడుతోంది. థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు పెడతారనే టాక్ నడుస్తోంది. అదే గనుక జరిగితే హనష్టాలను చూసే అవకాశాలే ఎక్కువని డిస్ట్రిబ్యూటర్లు వణికిపోతున్నారు.