పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఎక్కడుంటే అక్కడ క్రేజ్ తప్పనిసరిగా ఉంటుంది. ముఖ్యంగా అమెరికాలో. తెలుగు రాష్ట్రాల తర్వాత అమెరికాలో పవన్ మార్కెట్ పెద్దది. ఆయన సినిమాలు అక్కడ మిలియన్ల కలెక్షన్లు రాబడుతుంటాయి. అయితే ఈసారి మునుపటి ఊపు ఉంటుందా అనేదే అనుమానంగా మారింది. కరోనా కారణంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమ కోలుకునే స్థితిలోనే ఉంది. ఇలాంటి స్థితిలో తెలుగు సినిమాలకు అమెరికాలో భారీ రిలీజ్, ఆదరణ దక్కడమంటే కష్టతరమైన పనే.
అందుకే ఈమధ్య యూఎస్లో విడుదలైన తెలుగు సినిమాలు నీరసంగానే నడిచాయి. కానీ పవన్ ‘వకీల్ సాబ్’ మాత్రం ఆ పరిస్థితిని మార్చింది. సినిమా ఓవర్సీస్ హక్కులు సుమారు 5 కోట్లకు అమ్ముడయ్యాయి. అక్కడి డిస్ట్రిబ్యూటర్లు పెద్ద సంఖ్యలోనే థియేటర్లు తీసుకున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగానే జరుగుతున్నాయట. చాన్నాళ్ల తర్వాత వస్తున్న పెద్ద తెలుగు సినిమా కావడంతో కొవిడ్ భయాన్ని పక్కనబెట్టి టికెట్స్ బుక్ చేసుకుంటున్నారట. 40 శాతం ఆక్యుపెన్సీలో కూడ పవన్ మేనియా స్పష్టంగా కనబడుతోంది.