Ram Charan : మంచులో చిల్ అవుతున్న రాంచరణ్, ఉపాసన పిక్స్ వైరల్!!

Ram Charan : సెలబ్రిటీలు సాధారణంగానే అప్పుడప్పుడు విహారయాత్రలకు వెళ్తుంటారు. వారి జీవితాలు బాగా బిజీ ఉండటం వల్ల తీరిక దొరికినపుడు వాళ్ళ కుటుంబంతో గడపడానికి విదేశాలకు చెక్కేస్తారు. ఇలా వెళ్లడం లో మహేష్ బాబు కుటుంబం ముందుంటుంది. మహేష్ బాబు తన ఫ్యామిలీతో సమయం గడపడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఇక తర్వాత బన్నీ కూడా హాలిడే ట్రిప్స్ ని తన కుటుంబంతో ఎంజాయ్ చేస్తుంటారు.
కరోనా వల్ల సెలబ్రిటీల విహారయాత్రలకు బ్రేక్ పడిన మళ్ళీ నెమ్మదిగా విదేశాలకు ట్రిపులకు వెళ్తున్నారు సినిజనం. ఈ మధ్యనే ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ తదితరులు కుటుంబంతో విహారయాత్రకు వెళ్లారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ అయన సతీమణి ఉపాసన కూడా విదేశాలకు చెక్కేసారు.
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఫిన్లాండ్ ట్రిప్ ను మెగా కపుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మంచులో చిల్ అవుతూ ఫోటోలు దిగారు ఆ ఫోటోలను సామాజిక మధ్యమాలలో పోస్ట్ చేయడంతో ఇపుడు ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.
రెండేళ్ల క్రితం ఆఫ్రికన్ సఫారీ కి వెళ్లారు రామ్ చరణ్ ఉపాసన. అక్కడ క్రూర మృగాల మధ్య తిరుగుతూ ఫోటోషూట్ ను కూడా చేసారు.ఆ ఫోటోలను గ్యాలరీ గా ఏర్పాటు చేసి తమ ఇంట్లో స్నేహితులతో తమ అనుభవాలు పంచుకున్నారు.

రామ్ చరణ్ శంకర్ సినిమా షూటింగ్ జీ లో పాల్గొంటున్నారు. రాజమండ్రి లో మొదటి షెడ్యూల్ తర్వాత విరామంలో తన భార్యతో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తిరిగి వచ్చాక మళ్ళీ శంకర్ షూటింగ్ తో బిజీ అవుతారు. ఇక ఉపాసన కూడా బిజీ పర్సన్ అటు అపోలో చైర్ పర్సన్ గా విధులు నిర్వహిస్తూ ఇటు బి పాజిటివ్ మ్యాగజైన్ ను నడుపుతున్నారు. అలా వీరిద్దరూ కలిసి సమయాన్ని గడపడం కష్టమే అందుకే వీలు దొరికితే ఇలా విదేశీ విహారయాత్రలకు వెళ్తుంటారు.

ఇక చరణ్ ఫ్యాన్స్ కి వరుస ట్రీట్స్ సిద్ధం చేశారు. మరో రెండు వారాల్లో ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది. దేశవ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ పై భారీ హైప్ నెలకొని ఉంది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తుంటే, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ విడుదలైన నెల రోజుల్లో ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య మూవీలో చిరంజీవి, చరణ్ మొదటిసారి పూర్తి స్థాయి మల్టీస్టారర్ చేస్తున్నారు. ఇక శంకర్ మూవీ 2023 సంక్రాంతి కానుకగా విడుదల కానుందని సమాచారం.