మొత్తానికి కోలుకున్నాను.. యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా… ఉపాసన పోస్ట్ వైరల్!

మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. గత వారం కిందట కరోనా బారినపడ్డ తను తిరిగి కోలుకున్నాను అంటూ ఈ పోస్టు ద్వారా తెలియజేశారు. ఉపాసన ఈ పోస్టు ద్వారా ఏం చెప్పుకొచ్చారు అనే విషయానికి వస్తే… మొత్తానికి కోలుకున్నాను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను నా శరీరం ఏం చెబుతుందో అది వినడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఉపాసన ఈ పోస్టు ద్వారా తెలియజేశారు.

గత వారం చెన్నై అమ్మమ్మ తాతయ్యలను కలవడానికి వెళ్లడంతో కరోనా పరీక్ష చేయించుకున్నాను అయితే పాజిటివ్ అని నిర్ధారణ అయింది.ముందుగా కరోనా వ్యాక్సిన్ ముందుగా తీసుకోవటం వల్ల స్వల్ప లక్షణాలు ఉండటంతో టెస్ట్ చేయించుకున్నాను డాక్టర్లు కేవలం పారాసిట్మల్ విటమిన్ టాబ్లెట్ సూచించారు. నేను కరోనా పరీక్ష చేయించుకోవటం వల్లే బయటపడింది. లేదంటే తెలిసేదికాదు అంటూ ఈ పోస్టు ద్వారా తెలియజేశారు.

 

నాకు కరోనా అని తెలియడంతో చాలా మంది నీరసించిపోతారు, ఒళ్ళు నొప్పులు వస్తాయి, జుట్టు ఊడిపోతుంది అంటూ ఎన్నో చెప్పారు అయితే ఈ లక్షణాలు ఏవి నా పై ప్రభావం చూపలేదు. ఎందుకంటే నేను మెంటల్ గా ఎంతో స్ట్రాంగ్ అంటూ ఉపాసన ఈ పోస్టు ద్వారా తెలియజేశారు. తాను కరోనా బారిన పడటంతో వైరస్ మళ్లీ విజృంభిస్తుందా… అనే సందేహం కలిగింది అయిన మన జాగ్రత్తలో మనం ఉండటం తప్పనిసరి అంటూ ఈ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సమయంలో తనని తిరిగి తన పని లోకి తీసుకు వచ్చినందుకు అపోలో హాస్పిటల్ హైదరాబాద్ డాక్టర్ లకు ఉపాసన కృతజ్ఞతలు తెలిపారు.