Upasan: మెగా కోడలు ఉపాసన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఉపాసన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. ముఖ్యంగా కుటుంబాల గురించి బంధం బంధుత్వాల గురించి ఈమె మాట్లాడారు. ఈ క్రమంలోనే తన కుమార్తె క్లిన్ కారా గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. రామ్ చరణ్ ఉపాసన పెళ్లి జరిగిన దాదాపు 11 సంవత్సరాలకు ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
ఇక ఉపాసన తన కూతురి విషయంలో ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటూ ఉన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ..నేను మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గరే ఎక్కువగా పెరిగాను. నా కూతురు కూడా అలాగే పెరగాలి. తను గ్రాండ్ పేరెంట్స్ తో ఎక్కువ సమయం గడపాలి అనుకుంటాను. గ్రాండ్ పేరెంట్స్ తో ఉంటే అదొక అందమైన అనుభవం. ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీ కల్చర్ పూర్తిగా తగ్గిపోయిందని తెలిపారు.
నాకు జాయింట్ ఫ్యామిలీ అంటే ఇష్టం. నాకు అందరితో కలిసి ఉండాలి. మా అత్త మామ జాగ్రత్తగా చూసుకుంటారు. నేను వాళ్ళతో ఉండాలి అనుకుంటాను. నా కూతురు మంచి చేతుల్లో ఉంది. మా ఫ్యామిలీ, మా మామయ్య ఫ్యామిలీ అంతా క్లిన్ కారాని జాగ్రత్తగా పెంచుతున్నారనీ ఉపాసన తెలిపారు.
ఇలా పిల్లల పెంపకం గురించి జాయింట్ ఫ్యామిలీ గురించి ఉపాసన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఉపాసన తన భర్త రామ్ చరణ్ తో ఉన్న రిలేషన్ గురించి కూడా మాట్లాడారు. ఒక బిజినెస్ ప్రారంభించేటప్పుడు అందరూ కలిసి ఎలా సమీక్ష అయితే చేస్తామో ఒక రిలేషన్ కూడా బాగుండాలి అంటే అలాంటి సమీక్షలు తప్పనిసరి అని తెలిపారు. మా ఇద్దరి మధ్య ఏదైనా అభిప్రాయ బేధాలు వస్తే కూర్చొని ఇద్దరం వాటి గురించి డిస్కస్ చేసుకొని ఆ సమస్యను అక్కడితో తొలగించుకుంటామని అందుకే మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నామని ఉపాసన భార్యాభర్తల బంధం గురించి కూడా ఎంతో అద్భుతంగా తెలియజేశారు.