Un Stoppable: టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పటివరకు వెండితెర ప్రేక్షకులను అలరించారు. అయితే మొట్టమొదటిసారిగా బాలకృష్ణ హోస్ట్ గా అవతారమెత్తి అన్ స్టాపబుల్ అనే షోకి హాస్ట్ వ్యవహరించారు. ఈ షో ద్వారా బాలకృష్ణ తనలోని మరొక టాలెంట్ ను బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం చేశాడు. తన మాటలతో బుల్లితెర ప్రేక్షకులను సైతం అలరించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే 9 ఎపిసోడ్స్ ముగిసాయి. ఇక ఆ ఎపిసోడ్ నుంచి బెస్ట్ ను తీసుకొని పదవ ఎపిసోడ్ రూపొందించి బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. పదకొండవ ఎపిసోడ్ ఈ సీజన్ కు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కావడం విశేషం.
ఇక ఈ ఎపిసోడ్స్ అన్నింటిలో కూడా ఎక్కువగా బాలకృష్ణ యంగ్ జనరేషన్ తోనే సాగారు. ఇక ఈ షోలో బాలకృష్ణ తన ఆ తరం హీరోల్లో ఎవరితో టాక్ షో నిర్వహించలేదు. ఇది ఇలా ఉంటే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రానున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ ఎపిసోడ్ కోసం నందమూరి అభిమానులు ఘట్టమనేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు అదే విధంగా బాలకృష్ణ ఒకే స్టేజి పై కనిపిస్తే ఫ్యాన్స్ కు కన్నులపండుగ లాంటిదే అని చెప్పవచ్చు.ఇప్పటికే ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలు విడుదలైన విషయం తెలిసిందే. ప్రోమో లతో ఎపిసోడ్ పై అంచనాలు మరింత పెరిగాయి.
ఎపిసోడ్ ప్రారంభంలోనే బాలకృష్ణ ఆ ప్రేక్షకుల మధ్య కూర్చొని ఇప్పటిదాకా సాగించిన టాక్ షోని గుర్తు చేసుకున్నాడు. మొదటిసారి టాక్ షో చేస్తున్నాను కొత్తగా ఉంటుందేమో అనుకున్నా.. కానీ ఇక్కడకు వచ్చాక నాకు నేను కొత్తగా అనిపించా అని బాలయ్య తెలిపారు. నిజంగా మహేష్ బాబు ఎంట్రీ కోసం బాలయ్య చెప్పిన మాటలు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకున్నాయి. ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో భాగంగా బాలకృష్ణ మహేష్ బాబు చేసిన ఎన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాల గురించి ప్రేక్షకులకు తెలియజేశారు. అదేవిధంగా అలాంటి గొప్ప పనులు చేసిన మహేష్ బాబు పై బాలకృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు.