బ్రేకింగ్ : కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూత

Union Consumer Affairs Minister Ram Vilas Paswan is no more

కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు. ఆయన వయసు 74. ఆయన లోక్ జన్ శక్తి పార్టీ(ఎల్జేపీ) అధినేత. గత కొన్ని రోజుల నుంచి పాశ్వాన్ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయనకు ఇటీవలే ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో హార్ట్ కు సంబంధించిన సర్జరీ జరిగింది.

Union Consumer Affairs Minister Ram Vilas Paswan is no more
Union Consumer Affairs Minister Ram Vilas Paswan is no more

రామ్ విలాస్ పాశ్వాన్.. ఇక లేరని.. ఆయన మరణవార్తను తన కొడుకు, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ట్విట్టర్ లో ప్రకటించారు.

రామ్ విలాస్ పాశ్వాన్ బీహార్ లో జన్మించారు. ఆయన ఎనిమిది సార్లు లోక్ సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన బీహార్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అయితే.. ఎన్డీఏలో లోక్ జన్ శక్తి పార్టీ భాగస్వామ్య పార్టీ కావడంతో.. ప్రధాని మోదీ కేబినేట్ లో పాశ్వాన్ కు చోటు దక్కింది.

రామ్ విలాస్ పాశ్వాన్.. దేశంలోనే గొప్ప దళిత నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సుమారు ఐదు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగారు.

రామ్ విలాస్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ప్రధాని మోదీ.. రామ్ విలాస్ తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఇతర కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. రామ్ విలాస్ పాశ్వాన్ తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని.. ఆయనకు నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.