సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం సర్కారు వారి పాట కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఇప్పుడు స్పెయిన్ దేశంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం పై లేటెస్ట్ సమాచారం ఒకటి వినిపిస్తోంది. ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ హక్కులు డీల్ ఇప్పుడు ముగిసింది అంట.
అయితే ఈసారి ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు ఓ ఊహించని సంస్థ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. వారే “ఆహా”. మన తెలుగు కి చెందిన మొట్ట మొదటి స్ట్రీమింగ్ యాప్ ఇది. మరి వీరు ఇప్పుడు వరకు ఏ భారీ సినిమా కానీ స్టార్ హీరోల సినిమా కానీ తీసుకున్నది లేదు. బహుశా ఇదే మొదటి సారి కావచ్చు. మరి దీనికి ఎంత ధర పలికిందో అన్నది కూడా తెలియాల్సి ఉంది. మహేష్ సినిమా అంటే ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ లాంటి దిగ్గజ సంస్థలే పోటీ పడతాయి అలాంటిది వాటిని దాటి ఆహా వారు దక్కించుకోడం విశేషమే అని చెప్పాలి.