Bheemla Nayak : ఇన్సైడ్ టాక్ : “భీమ్లా నాయక్” పై ఊహించని సమాచారం మీకోసం!

Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మాస్ ఎంటర్టైన్ చిత్రం “భీమ్లా నాయక్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. వికారాబాద్ కొండ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ పవన్ మరియు రానా దగ్గుబాటి ల పైనే కొన్ని ముఖ్య సన్నివేశాలు జరుపుకుంటుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ పట్ల ఓ ఊహించని సమాచారమ్ మీకోసం తీసుకొచ్చాం.. గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమా వాయిదా పట్ల గట్టి ఊహాగానాలే నడుస్తున్నాయి. కానీ వాటిని ఖండిస్తూ నిర్మాత ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నాడు. అయినా ఇతర సినిమాల వారు మాత్రం భీమ్లా నాయక్ వాయిదా వెయ్యాలని గట్టిగా అభ్యర్ధిస్తున్నారట.

అందుకే పవన్ అపాయింట్మెంట్ కోసం కూడా ఎదురు చూసారు. మరి ఇపుడు ఈ వాయిదాపై క్లారిటీ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడే ట్విస్ట్ ఏమిటంటే పవన్ నుంచే భీమ్లా నాయక్ సినిమా వాయిదా పడుతున్నట్టు క్లారిటీ ఇవ్వనున్నారని ఇన్సైడ్ టాక్. అంటే బహుశా ఏదన్నా ప్రెస్ నోట్ తో ఈ క్లారిటీ రానుందో ఏమో అనేది చూడాలి. ఇప్పుడు అయితే ఇండస్ట్రీ లో ఇదే టాక్ నడుస్తుంది. మరి ఇది ఎంతమేర నిజమవుతుందో వేచి చూడాలి.