ఉక్రెయిన్ సంక్షోభం ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బ్యారెల్ ధర 110 డాలర్ల మార్క్‌ను చేరింది.2014 తర్వాత అత్యధిక ట్రేడింగ్ ధర కావడం విశేషం. ఆయిల్ ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరగనున్నాయి. లీటర్ పెట్రోల్ ధర 150 – 160 అవకాశం ఉంది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన ధరలు పెంచనున్నారు. బ్యారెల్ ఇంధనం ధర పెరుగుదలతో పెట్టుబడిదారులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇక ఇంధనం ఉత్పత్తి చేస్తున్న పెద్ద దేశాల్లో రష్యా ఒకటి. ఉక్రెయిన్ జరుగుతున్న వార్‌తో ఇంధనాన్ని సరఫరాపై ప్రభావం పడే అవకాశాలు ఉంది.