చిరంజీవి కోసం ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ గొడవపడ్డారా?

ఎన్టీఆర్, కృష్ణ తర్వాత జనరేషన్ లో వాళ్ళిద్దరికంటే ఎక్కువ మాస్ ఫాలోయింగ్ కలిగిన హీరో చిరంజీవి. వెరైటీ డాన్సులు, ఫైట్స్ తో చిరంజీవి తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. అప్పటికే కృష్ణ నెంబర్ వన్ హీరో గా దూసుకుపోతున్నాయి…ఆయన్ను పక్కకు నెట్టి చిరంజీవి టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో గా ఎదిగాడు.

అప్పట్లో చిరంజీవి ఉండే క్రేజ్ మామూలు కాదు. ఆయన సినిమాల కోసం డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ తో పాటు హీరోయిన్లు కూడా వేచి చూసేవారు. ఒకానొక సందర్భంలో ఆ నాటి స్టార్ హీరోయిన్స్ రాధా, విజయశాంతి చిరంజీవి కోసం గొడవలు కూడా పడ్డారంట.

చిరంజీవి – విజయశాంతి కాంబినేషన్ లో ఓ సూపర్ హిట్ సినిమా వచ్చిన వెంటనే.. రాధా – చిరు కాంబినేషన్లో మరో హిట్ సినిమా వచ్చేసేది. అయితే ఒక్కోసారి విజయశాంతి డేట్లు ఖాళీ లేకపోతే రాధను హీరోయిన్‌గా తీసుకోవడం… రాధ‌ బిజీగా ఉంటే విజయశాంతిని తీసుకోవటం జరిగేదట. ఈ క్రమంలోనే విజయశాంతి, రాధ మధ్య అప్పట్లో కోల్డ్‌వార్ కూడా జరిగేదట.

ఎంత కోల్డ్ వార్ ఉన్నప్పటికీ చిరంజీవి, రాధ కలిసి చిరంజీవి తో చాలా సినిమాల్లో నటించారు.