సుమ కోసం వస్తున్న ఇద్దరు బిగ్ స్టార్స్.!

Two Special Guests For Suma

Two Special Guests For Suma : జెనరల్ గా మన టాలీవుడ్ లో ఏ భారీ సినిమా అయినా అలాగే దాదాపు 90 శాతంకి పైగా చిత్రాలు యాంకర్ సుమ వాయిస్ లేకుండా జరిగే పని కాదు అందుకే మన టాలీవుడ్ బిగ్ స్టార్స్ నుంచి డైరెక్టర్ లు వరకు సుమ కి ఎంతో గౌరవం అందిస్తారు. అయితే ఇప్పటి వరకు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన సుమ మొదటిసారిగా తనపై ఓ సినిమాతో పలకరించేందుకు సిద్ధంగా ఉంది.

ఆ చిత్రమే “జయమ్మ పంచాయితీ”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఎన్నో సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ లకి తాను యాంకర్ గా వ్యవహరించిన సుమ మొదటిసారి తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఒక నటిగా కూర్చోబోతుంది.

దీనితో ఈ సినిమా నిజంగా ఆమెకి ఒక సూపర్ స్పెషల్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. మరి ఈ సినిమాకి మరింత సపోర్ట్ ఇచ్చే విధంగా టాలీవుడ్ కి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు ఇప్పుడు వస్తున్నారు. రేపు ఏప్రిల్ 30న జరగబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గాను అక్కినేని సీనియర్ హీరో అక్కినేని నాగార్జున మరియు నాచురల్ స్టార్ నాని లు స్పెషల్ గెస్టులుగా రాబోతున్నారట.

ఇది తన సినిమాకి మంచి ప్లానింగ్ అని చెప్పాలి. ఆల్రెడీ ట్రైలర్ కూడా మంచి ప్రామిసింగ్ గానే ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.