“RRR” సినిమాపై రెండు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం.!

దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR). మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో తీసిన ఈ సినిమాపై తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన రెండు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇప్పుడు తెలుస్తున్నాయి.

మొదటగా ఈ సినిమాకి సంబంధించిన అదిరే ట్రైలర్ కట్ ని చిత్ర యూనిట్ భారీ లెవెల్లో ఉండే దాన్ని ఆల్రెడీ రెడీ చేసారట. అంతేకాకుండా ఈ వచ్చే డిసెంబర్ 4న ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చే అవకాశం ఉందని గట్టి టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఈ సినిమాలో పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా నటించగా ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. అలాగే డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.