Bheemla Nayak : ఇండస్ట్రీ బజ్ : “భీమ్లా నాయక్” నుంచి రెండు క్రేజీ అప్డేట్స్ మీకోసం.!

Bheemla Nayak :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి అలానే నిత్యా మీనన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న లేటెస్ట్ సినిమా “భీమ్లా నాయక్” కోసం అందరికీ తెలిసిందే. మాస్ ఆడియెన్స్ లో చాలా అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని నిజానికి ఈ జనవరి సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. కానీ అనూహ్యంగా భీమ్లా ఈ రేస్ నుంచి తప్పుకున్నాడు.

కానీ మళ్ళీ భీమ్లా నాయక్ రిలీజ్ పై పలు ఆసక్తికర గాసిప్స్ వినిపించినా ప్రస్తుతం సినీ వర్గాల టాక్ ప్రకారం థమన్ డేట్స్ లేక భీమ్లా నాయక్ రిలీజ్ జనవరిలో తప్పుకుంది. ఇక ఇదిలా ఉండగా మరిన్ని ఆసక్తికర అంశాలు ఈ సినిమాపై తెలుస్తున్నాయి. మొదటగా ఈ సినిమాలో అదిరిపోయే సాంగ్ అదే పవన్ కళ్యాణ్ పాడిన పక్కా మాస్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చెయ్యడానికి రెడీ చేస్తున్నారట.

ఇది కూడా త్వరలోనే రిలీజ్ ఉంటుందట. ఇక ఇంకో అప్డేట్ ఏమిటంటే ఈ సినిమా టీజర్ పై తెలుస్తుంది. ఈ టీజర్ ని ఈ సంక్రాంతికే అనుకుంటున్నారు అంట కానీ ఇది కూడా కన్ఫర్మ్ కాదని ఇన్సైడ్ టాక్. ఇది ప్రస్తుతం కరోనా పరిస్థితిపై డిపెండ్ అయ్యి ఉందని అలాగే ఫిబ్రవరి రిలీజ్ కూడా దీనిపైనే డిసైడ్ అయ్యి ఉందని సినీ వర్గాల్లో గుసగుసలు.