KGF Chapter 2 : ట్విట్టర్ రివ్యూ : సౌత్ సెన్సేషన్ “కేజీఎఫ్ 2” కి ఒకటే రిపోర్ట్ వినిపిస్తుంది.!

KGF Chapter 2 : మళ్ళీ ఎన్నో ఏళ్ల నుంచి ఇండియా వైడ్ ప్రేక్షకులు ఓ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది కన్నడ రాకింగ్ స్టార్ యాష్ బాస్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ ఆక్షన్ డ్రామా “కేజీఎఫ్ చాప్టర్ 2” అనే చెప్పాలి.
మన సౌత్ ఇండియా సినిమా నుంచి “బాహుబలి 2” తర్వాత మళ్ళీ ఒక సీక్వెల్ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన ఏకైక సినిమా అయితే ఇదే.
ఇలా ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమాని చిత్ర యూనిట్ ఫైనల్ గా ఈరోజు ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా 10 వేలకు పైగా స్క్రీన్స్ లో విడుదల చేశారు. అయితే ఈ సినిమా చూసిన ట్విట్టర్ ప్రజానీకం నుంచి మాత్రం వందకి వంద శాతం పాజిటివ్ టాక్ మాత్రమే వస్తుంది.
చాప్టర్ 1 కంటే మించి ఇది అదిరే లెవెల్లో ఉందని కంప్లీట్ గూజ్ బంప్స్ తెప్పించే స్టఫ్ తో ఉందని అంటున్నారు. ఆ ఎలివేషన్స్ అయితే ఏమి, సంగీతం అయితేనేమి ప్రశాంత్ నీల్ దర్శకత్వానికి మరియు యష్ నటనకి సాలిడ్ రిపోర్ట్స్ అందిస్తున్నారు.
పక్కా బ్లాక బస్టర్ సినిమా అంటూ కొనియాడుతున్నారు.
అలాగే సినీ ప్రముఖులు అయితే ఈ రాకీ పాత్ర చెయ్యడానికే యష్ పుట్టినట్టు ఉన్నాడని అంటున్నారు. అలాగే ఈ సినిమాలో మంచి సందేశం కూడా ఉందని అంటున్నారు. మొత్తానికి అయితే సినిమా మాత్రం పగిలిపోయింది అనే రేంజ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.
ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాల్సిందే.
https://twitter.com/thisisrmk/status/1514434857166061570?s=20&t=KTBrpTRyEDyRd7bijESOhg