“RRR” షూట్ లో ట్విస్ట్! ఇంకా ఈ సీన్స్ బ్యాలన్స్ అట.!

దర్శక ధీరుడు రాజమౌళి ఇద్దరు మాస్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో తీసిన భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) కోసమే ఇంకొన్ని రోజులు కాస్త ఎక్కువగా టాక్ వినిపిస్తోంది. షూటింగ్ అంతా అయ్యిపోయింది, అంతా ఇతర పనుల్లో బిజీగా ఉన్నారు అనుకుంటే ఇప్పుడు ఇంకో ట్విస్ట్ వినిపిస్తోంది. 
 
ఈ సినిమా తాలూకా షూట్ ఇంకా కొద్దిగా బాలన్స్ ఉందట. ఇది రామ్ చరణ్ సీతారామరాజు ఆలియా భట్ సీత పాత్రలపై అని తెలుస్తోంది. వీరిపై కొన్ని సన్నివేశాలు రాజమౌళి చిత్రీకరణ చెయ్యనున్నాడట. అలాగే ఇది కూడా ఒక సాంగ్ అని సమాచారం. మొత్తంగా మాత్రం రాజమౌళి మళ్లీ కొద్దిగా బ్యాలన్స్ ఉంచాడనికి చెప్పాలి.