వైరల్ వీడియో: తాబేల్లలో ఇంత క్రూరత్వం ఉంటుందా? పావురాన్ని ఎలా చంపిందో చూడండి..!

turtle kills pigeon video goes viral

తాబేలు గురించి ఎవ్వరికి తెలియదు చెప్పండి. అది నెమ్మదిగా నడవడం మాత్రమే కాదు.. దానిది సాధు స్వభావం. అది పెద్దగా దేన్నీ నొప్పించదు. దాని పనేదో అదే. కానీ.. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో మాత్రం తాబేలు స్వభావానికి విరుద్ధంగా ఉంటుంది.

turtle kills pigeon video goes viral
turtle kills pigeon video goes viral

అవును.. ఏంటి.. ఈ తాబేలులో ఇంత క్రూరత్వం ఉంది అని మీరు అనుకుంటారు. వామ్మో తాబేలులో మరో కోణం కూడా ఉందా అని అనుకుంటారు.

ఇంతకీ ఏం జరిగిందంటే… ఓ తాబేలు నీటిలో నుంచి బయటి వచ్చి.. అక్కడే ఉన్న పావురాలలో ఒక పావురాన్ని లటక్కున అందుకొని నీటిలోపలికి తీసుకెళ్లిపోయింది. అంతే.. ఆ పావురం క్షణాల్లో ప్రాణాలు విడిచింది.

ఇంత ఫాస్ట్ గా తాబేలు రియాక్ట్ అవడం ఏంటి? ఆ పావురాన్ని నోటితో కరుచుకొని నీటిలోకి తీసుకెళ్లడమేంటని నెటిజన్లు ఆ వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఈ వీడియో ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే.. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది.

ఇక నెటిజన్లు ఊరుకుంటారా? ఆ వీడియోపై తెగ కామెంట్లు చేస్తున్నారు. వామ్మో.. నా జీవితంలో ఇంత వేగంగా కదిలిన తాబేలు ఇదేనంటూ కామెంట్లు పెడుతున్నారు.

https://twitter.com/AmazingScaryVid/status/1305537944128614405