బిగ్ బాస్ సీజన్ 6 మొదలయ్యి ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడం మొదలుపెట్టింది. ఈ విషయం అందరికీ తెలిసిందే.21 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ఇందులో ఒకరు రాజశేఖర్ గారి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మనం ఇప్పుడు చూద్దాం.
రాజశేఖర్ 1992లో హైదరాబాద్ లో జన్మించాడు. ఈయనకు ఒక సోదరి ఉంది. విద్యాభ్యాసమంతా హైదరాబాదులోనే కొనసాగించి బీకాం కంప్యూటర్స్ పూర్తి చేసిన తర్వాత నాలుగు సంవత్సరాలు ఫైనాన్షియల్ కు సంబంధించిన ఉద్యోగం చేశాడు. ఇతనికి నటన అంటే కూడా ఇష్టం కావడంతో మొదట మోడలింగ్ లో ప్రవేశించేందుకు బెంగుళూరు వెళ్లి ఉద్యోగం చేస్తూనే అటువైపు ప్రయత్నాలు చేశాడు.
2020 లో ఉద్యోగం వదిలేసి పూర్తిగా మోడలింగ్ వైపే దృష్టి మలుచుకున్నాడు. మొదటిసారిగా 2015లో సెంట్రల్ క్లాత్ బ్రాండ్ కు మోడలింగ్ చేసే అవకాశం వచ్చింది. తర్వాత వరుస అవకాశాలతో ఇండియాలో దాదాపు 250 డిజైనర్స్ తో వర్క్ చేశాడు. తన కెరీర్లో చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ముంబైలోని ఫ్యాషన్ డిజైనర్ అయినా మల్హోత్రా గారికి అవుట్ లుక్ డిజైనర్ గా పనిచేశాడు.
విరాట్ కోహ్లీ, విజయ్ దేవరకొండ ఇలాంటి ప్రముఖులతో టీవీ షోను షేర్ చేసుకున్నాడు. అంతేకాకుండా టీవీ సీరియల్స్ జీ తెలుగులో ప్రసారమయ్యే కళ్యాణ వైభోగం, ఈటీవీలో ప్రసారమయ్యే మనసంతా నువ్వే సీరియల్ లో నటించడం జరిగింది. రాజశేఖర్ కు వి జే సన్నీ, బిగ్ బాస్ ఓటీటీ అనిల్ రాథోడ్, టీవీ యాక్టర్ మెగాన మంచి స్నేహితులు. అలాగే ఆహా ఓ టీ టీ లో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. మంచి అవకాశాలతో రాణించాలని కోరుకుందాం.