TSR: ఈనెల 27న తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక దినోత్సవాన్ని హైదరాబాదులో జరపనున్నారు. ఇక ఈ 22వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిసింది. ఇక ఇందులో మాజీ మంత్రులతో పాటు ఇప్పుడున్న మంత్రులు కూడా పాల్గొననున్నారు.
ఇక ఇందులో కేసీఆర్ పార్టీ శ్రేణుల గురించి వివరించి.. 11 తీర్మానాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ సభలో చేసే రాజకీయ తీర్మానంతో ఈ పార్టీ భవిష్యత్ రాజకీయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలియనుంది. ఇక 11 తీర్మానాలపై చర్చించిన తర్వాత సాయంత్రం ఐదు గంటలకు ఈ సభ ముగియనున్నట్లు తెలుస్తుంది. ఇతర పార్టీలతో ఏకతాటి పైకి తెచ్చే ప్రయత్నం చేస్తామంటున్నారు అని.. ఆ విషయం గురించి చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది.