Balayya Comments : గత ఏడాది మన టాలీవుడ్ హీరోల్లో సాలిడ్ కం బ్యాక్ అందుకున్న స్టార్ హీరోస్ లో నందమూరి వారి హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. తన కెరీర్ లోనే భారీ హిట్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తో చేసిన “అఖండ” నిలిచింది. అయితే ఇదిలా ఉండగా ఈ సినిమా కి కూడా టికెట్ ధరల సమస్యలో ఉండే హిట్ అయ్యింది.
ఒకవేళ ముందు రేట్స్ గాని ఉండి ఉంటే మరిన్ని భారీ రికార్డ్స్ ఈ చిత్రం అందుకొని ఉండేది. అయితే ఈ సినిమా సక్సెస్ అనంతరమే ఏపీలో నెలకొన్న టికెట్ ధరల సంక్షోభం పై తాను మాట్లాడారు. కానీ లేటెస్ట్ గా అయితే బాలయ్య చేసిన కొన్ని సంచలన కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.
తాను ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే “నేను రాజకీయం పరంగా తన నియోజకవర్గ ప్రజల కోసం ఎక్కడి వరకు అయినా వెళ్తానని కానీ నా సినిమాల విషయంలో మాత్రం ఎవరి కాళ్ళ దగ్గరకి వెళ్లే ప్రసక్తి లేదు” అని ఒక మాస్ స్టేట్మెంట్ ని బాలయ్య అందించారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.
దీనితో బాలయ్య అభిమానులు ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తున్నా మరి ఇదే బాలయ్య తన సినిమా “గౌతమి పుత్ర శాతకర్ణి” కోసం తెలంగాణా సీఎం దగ్గరకి వెళ్లి మాట్లాడలేదా? ఇప్పుడు ఎందుకు ఇలాంటి గొప్పలు చెప్పుకోవడం అంటూ అప్పటి పిక్స్ పెట్టి కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. దీనితో బాలయ్య మాస్ స్టేట్మెంట్ ఇలా బోల్తా కొట్టినట్టు అయ్యింది.