పవన్ దొరక్క త్రివిక్రమ్ తిప్పలు

Trivikram waiting for Pawan Kalyan
Trivikram waiting for Pawan Kalyan
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం పట్ల అందరికంటే ఎక్కువగా సంతోషించింది త్రివిక్రమ్. ఎందుకంటే తన హీరో తనకు అందుబాటులోకి వచ్చేశాడు కాబట్టి. టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్లలో పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ కూడ ఒకటి. పవన్ రాకతో ఇక ఆయనతో సినిమా చేయాలని త్రివిక్రమ్ ఆశించారు. కానీ త్రివిక్రమ్ ఆశలు తీరలేదు. పవన్ రావడమే పాత అగ్రిమెంట్స్ భుజాన వేసుకొచ్చారు.  గతంలో ఆయన కొందరు నిర్మాతలకు సినిమా చేస్తానని మాటిచ్చి ఉన్నారు. అందుకే ముందు వారి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  
 
ఆ సినిమాలతోనే పవన్ షెడ్యూల్ రెండేళ్లు నిండిపోయింది.  దీంతో త్రివిక్రమ్ కు ఇప్పుడప్పుడే పవన్ ను డైరెక్ట్ చేసే అవకాశం లేకుండా పోయింది. అందుకే ఆయన వేరే ప్రాజెక్ట్స్ చూసుకున్నారు. ముందుగా ఎన్టీఆర్ సినిమా చేయనున్నారు.  అది పూర్తయ్యాక ‘అ.. ఆ’ తరహాలో ఒక మీడియమ్ స్థాయి సినిమా చేసి ఆతర్వాత రామ్ చరణ్ తేజ్ తో వర్క్ చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలకు సంబంధించిన కథలు కూడ రెడీగా ఉన్నాయట ఆయన వద్ద. ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి పవన్ కూడ ఖాళీ అవుతారు.  అప్పుడు ఆయన డేట్స్ ఖచ్చితంగా దొరుకుతాయని త్రివిక్రమ్ భావిస్తున్నారు.