త్రివిక్రమ్, మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో పన్నెండు సంవత్సరాల తర్వాత మూవీ రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా మీద చాలా ఆశలు ఉన్నాయి. తమ కాంబినేషన్ లో వచ్చిన ‘ఖలేజా’ ప్లాప్ అవ్వడంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని త్రివిక్రమ్ గట్టిగా నిర్ణయించుకున్నాడు. సెప్టెంబర్ రెండవ వారం నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూట్‌ను స్టార్ట్ చేయబోతున్నారు అని టాక్ నడుస్తోంది.

అయితే ఈ మధ్య త్రివిక్రమ్ తన సినిమాల్లో ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోస్ ని తన సినిమాల్లో మంచి రోల్ ఇచ్చి ప్రోత్సహాహిస్తున్నాడు. ‘అరవింద సమేత’ సినిమాలో నవీన్ చంద్ర, ‘అల వైకుంఠపురంలో’ సుశాంత్ కి మంచి బ్రేక్ ఇచ్చాడు త్రివిక్రమ్.

తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో ఒక కీలక పాత్ర ఉందని, ఆ పాత్ర కోసం ఇప్పటికే చాలా మంది హీరోలను కలిశారు, కానీ ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఒకప్పటి  స్టార్  హీరో ణ్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. తరుణ్ హీరోగా నటించిన ‘నువ్వే నువ్వే’ సినిమాతోనే త్రివిక్రమ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు.

గత కొన్నేళ్లుగా తరుణ్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు త్రివిక్రమ్ కోసం నటుడిగా మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28, 2023న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.