మహేష్ బాబుతో పోటీగా త్రివిక్రమ్ రెమ్యునరేషన్

Trivikram charging remuneration equal to Mahesh

Trivikram charging remuneration equal to Mahesh

ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోల్లో మహేష్ బాబు కూడ ఒకరు. మహేష్, పవన్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు వర్క్ చేసే దర్శకుల రెమ్యునరేషన్ కూడ భారీగానే ఉంటుంది కానీ హీరోల స్థాయిలో అయితే ఉండదు. కానీ త్రివిక్రమ్ మాత్రం హీరో స్థాయిలో రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారట. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో సినిమా చేసే పనుల్లో ఉన్నారు. ప్రీప్రొడక్షన్ మొదలైంది. ‘సర్కారు వారి పాట’ ముగియగానే చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్ సెట్ చేయడానికి చాలా తతంగమే నడిచింది. త్రివిక్రమ్ ను ఒప్పించడానికి పలువురు రాయబారాలు చేయాల్సి వచ్చింది.

నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ వద్ద మహేష్ డేట్స్ ఉండటంతో వాళ్ళు త్రివిక్రమ్ ను అతి కష్టం మీద ఒప్పించారు. హారికా హాసిని బ్యానర్ అంటే సొంత సంస్థగా భావించే త్రివిక్రమ్ వాళ్ళ కోసమే sఇనిమా ఒప్పుకున్నారు. దీంతో నిర్మాత దాదాపుగా హీరోకి ఇచ్చేటంత రెమ్యునరేషన్ త్రివిక్రమ్ కు కూడ ఇస్తున్నారట. అంతేకాదు మహేష్ బాబుకు కూడ ఇప్పుడు అందుతున్న పారితోషకమే హయ్యస్ట్ అని తెలుస్తోంది. మొత్తానికి త్రివిక్రమ్, మహేష్ బాబులకే బడ్జెట్లో సగం చెల్లిస్తున్నారు నిర్మాత. ఇకపోతే ఈ చిత్రానికి ‘పార్థు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.