పవన్ కళ్యాణ్ సరసన త్రిష.. జోడీ కుదిరేనా.?

మెగాస్టార్, పవర్ స్టార్.. ఇలా సీనియర్ హీరోలు జోరు పెంచిన తరుణంలో వారితో జత కట్టేందుకు సీనియర్ ముద్దుగుమ్మల లోటు బాగా కనిపిస్తోంది టాలీవుడ్‌లో. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ వంటి లేత భామలు జోడీ కడుతున్నారు.

కాగా, మరిన్ని ప్రాజెక్టులు సీనియర్ హీరోలు లైన్‌లో పెట్టేశారు. ఆ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ముద్దుగుమ్మ త్రిష పేరు తాజాగా తెరపైకి వచ్చింది. గతంలో త్రిష – పవన్ కళ్యాణ్ కలిసి ‘తీన్‌మార్’ సినిమాలో నటించారు.

ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అంతకు ముందే, ‘బంగారం’ సినిమాలో క్లైమాక్స్ సీన్‌లో త్రిష కనిపిస్తుంది. అయితే, లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ వీరిద్దరి జోడీ కుదిరేలా ఉంది. అన్నట్టు మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమాలో త్రిష నటించాల్సి ఉంది. కానీ, ఆ ఛాన్స్ త్రిష మిస్ చేసుకున్న సంగతి తెలిసిందే.