ట్రైలర్ టాక్ : “పక్కా కమర్షియల్”..కాస్త బాగానే ఉండేలా ఉందే..!

టాలీవుడ్ దగ్గర పెద్దగా కథతో సంబంధం లేకుండా జస్ట్ ఎంటర్టైనింగ్ నరేషన్ ఉంటే చాలు ఎన్నో సినిమాలు హిట్స్ అయ్యాయి. మరి అలాంటి సినిమాలు అందించడంలో కొందరు టాలీవుడ్ దర్శకులు అయితే బాగానే సక్సెస్ అయ్యారు. మరి అలాంటి దర్శకుల్లో మారుతీ కూడా ఒకడు. 

కథ రొటీన్ కథలే ఎంచుకున్నా కూడా ఫ్యామిలీ ని ఆకట్టుకునే నరేషన్ తో లాగించేస్తాడు. మరి తాను ఇప్పుడు దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమానే “పక్కా కమర్షియల్”. మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా ఈరోజు తన బర్త్ డే కానుకగా చిత్ర యూనిట్ ఈ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ చూస్తే మాత్రం మంచి ఫన్నీ ఎంటర్టైనర్ గా కనిపిస్తుంది. 

నిజానికి మారుతీ గత చిత్రాలతో కంపేర్ చేస్తే కథ కొత్త కథతోనే వచ్చినట్టు గా అనిపించక మానదు. కొత్త కథనంతో పాటుగా ఫన్నీ ట్రీట్ కూడా దండి గానే పెట్టినట్టే ఉన్నారని చెప్పాలి. అలాగే హీరోయిన్ రాశీ ఖన్నా కి అయితే ప్రతి రోజు పండగే తర్వాత మళ్ళీ ఒక కామెడీ రోల్ రాసినట్టు ఉన్నారు. హీరో హీరోయిన్స్ కూడా లాయర్లు గా కనిపిస్తున్నారు. 

చాలా రోజులకి వారికి ఇవి కొత్త రోల్స్ అని చెప్పాలి. అలాగే సత్య రాజ్ నటుడు రావు రమేష్ ల రోల్స్ మాత్రం మరింత ఇంట్రెస్టింగ్ గా ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాయ్. మొత్తంగా చూస్తే మాత్రం ట్రైలర్ తో ఈ సినిమాలో హిట్ లక్షణాలు బాగానే కనిపిస్తున్నాయి. మరి ఈ జులై 1న వచ్చే సినిమా అయితే ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి జెక్స్ బిజోయ్ సంగీతం అందించగా బన్నీ వాసు మరియు యూవీ క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.