ట్రైలర్ టాక్ : “అవతార్ 2” విజువల్స్ కన్నా ఈ అంశం మెయిన్ హైలైట్.!

ఇప్పుడు ప్రపంచ సినిమా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “అవతార్ 2”. హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జేమ్స్ కామెరాన్ స్టార్ట్ చేసిన ఈ అద్భుత సృష్టి మొదట 2009 లో స్టార్ట్ కాగా ఇప్పుడు రెండో భాగం “అవతార్ ది వే ఆఫ్ వాటర్” 2022 లో గ్రాండ్ రిలీజ్ కి రెడీ గా ఉంది.

అయితే నిన్న రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ కోసం మన తెలుగు ఆడియెన్స్ కూడా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దీనితో కాస్త లేట్ అయినా కూడా ఆ ఎగ్జైట్మెంట్ ఎంతో సేపు ఉంచకుండా మేకర్స్ ఈ అవైటెడ్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు.

ఈ ట్రైలర్ కోసం మాట్లాడుకున్నట్టయితే డెఫినెట్ గా అవతార్ కన్నా మించే ఈ చిత్రం కనిపిస్తుంది. కేవలం రెండు నిమిషాల్లో వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర కొత్త లెక్కలు చూపించారు. మళ్ళీ పండోర గ్రహం లోకి తీసుకెళ్లారు. అయితే ఈసారి నీటిలో కొత్త ప్రపంచాన్ని నెక్స్ట్ లెవెల్లో చూపించారు.

అయితే ఈ విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో అనిపించాయి. కానీ వీటిని కూడా డామినేట్ చేసిన అంశం మాకు బాగా నచ్చిన అంశం ఏదన్నా ఉంది అంటే ఇందులో కామెరాన్ చూపించిన ఎమోషన్స్ అని చెప్పాలి. అవతార్ లు వారి తెగ కి మళ్ళీ మనుషులకి జరిగే యుద్ధం అందులో వారిని కాపాడుకుంటే ప్రయత్నం.

వారి కుటుంబంపై అంశాలు ఎమోషన్స్ అవతార్ 1 లానే చాలా ఆసక్తిగా ఉన్నాయి. దీనితో మాత్రం మళ్ళీ ప్రపంచ ఆడియెన్స్ డెఫినెట్ గా ఇంప్రెస్ అవుతారు. ఇక పూర్తి సినిమా ఏ లెవెల్లో ఉంటుందో తెలియాలి అంటే ఈ డిసెంబర్ 16 న రిలీజ్ వరకు ఆగాల్సిందే. 
https://youtu.be/AHjYIbxHKV0