ముంబై లో విషాదం.. పాఠాలు చెప్పిన బడిలోనే విగతజీవిగా మారిన టీచర్…?

woman kills her own brother in guntur dist in ap

ప్రమాదాలు ఎప్పుడు ఎలా సంభవిస్తాయో ఎవరు ఊహించలేరు. కొన్ని సందర్భాలలో ఈ అనుకొని ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాగావా ముంబైలో ఇటువంటి విషాద సంఘటన చోటుచేసుకుంది. అప్పటివరకు పిల్లలకు పాఠాలు చెప్పి కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని వెళ్తూ అనుకోని పరిణామాల వల్ల లిఫ్టులో ఇరుక్కుని ఒక మహిళ ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మరణించిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

వివరాలలోకి వెళితే…జెనెల్ ఫెర్నాండెజ్ అనే మహిళ ఉత్తర ముంబైలోని శివారు ప్రాంతమైన మలాడ్‌లోని చించోలి బందర్‌లోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ హైస్కూల్‌ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది. ఈ విరామంలో ఎప్పటికి లాగే శుక్రవారం కూడా పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం వరకు పిల్లలకు పాఠాలు చెప్పింది. తర్వాత మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో విశ్రాంతి తీసుకోవటానికి స్టాఫ్ రూమ్ కు వెళ్లడం కోసం లిఫ్ట్ లోకి ప్రవేశించింది. టీచర్ అదుపుతప్పి కింద పడిన వెంటనే లిఫ్ట్ తలుపులు వెంటనే లిఫ్ట్ తలుపులు మూసుకున్నాయి. దీంతో టీచర్ తన లిఫ్ట్ తలుపుల మధ్య ఇరుక్కొని తీవ్ర గాయాల పాలయ్యింది.

పాఠశాల సిబ్బంది విషయాన్ని వెంటనే గమనించి ఆమెను హుటాహుటిన దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు తలకు బలంగా దెబ్బ తగిలి రక్తస్రావం కావడంతో అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. టీచర్ మరణంతో పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటిదాకా అందరితో కలిసి ఉన్న జెనెల్ ఫెర్నాండెజ్ ఇలా మృతి చెందడంతో తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.