Hanuman Jayanthi: హనుమాన్‌ జయంతి నేపథ్యంలో హైదరాబాద్a‌లో ట్రాఫిక్‌ అంక్షలు!

 హనుమాన్‌ జయంతి నేపథ్యంలో జరిగే విజయ్‌ యాత్ర సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్‌ అంక్షలు విధించారు. గౌలిగూడ రామ్‌ మందిర్‌లో ఉదయం 11.30 గంటలకు మొదలై సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్‌ హనుమాన్‌ మందిర్‌ వద్ద రాత్రి 8 గంటలకు యాత్ర ముగియనుంది. ఊరేగింపులు ఏయే ప్రాంతాలకు చేరుకుంటే అక్కడ, ఆయా సమయాల్లో మళ్లింపులు, ఆంక్షలు అమలవుతాయి.