Modi: ఫెయిల్డ్ ప్రధాని: పోటెత్తుతున్న సోషల్ మీడియా

TR Exclusive: Modi Failed PM, BJP Worrying?

Modi: ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ‘ఫెయిల్డ్ పీఎం’ అంటోంది సోషల్ మీడియా. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ సాధించిన విజయాల గురించి కొత్తగా చెప్పేదేముంది.? అయితే, అదంతా పబ్లిసిటీ స్టంట్ అంటారు కొందరు. అదే పబ్లిసిటీ స్టంట్ దేశ రాజకీయాల్లోనూ చేసి, సీనియర్లను తొక్కేసి మోడీ ప్రధాని అయ్యారనే విమర్శలున్నాయి. సరే, అదంతా గిట్టనివారు చేసే దుష్ప్రచారం.. అన్నది ఇంకో వాదన.

TR Exclusive: Modi Failed PM, BJP Worrying?
TR Exclusive: Modi Failed PM, BJP Worrying?

కాగా, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు, పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, కొత్త వ్యవసాయ చట్టాలు.. ఇలా చాలా విషయాల్లో మోడీని ఫెయిల్డ్ ఫీఎం.. అని నిరూపించేందుకు విపక్షాలు నానా రకాలుగా ప్రయత్నించి భంగపడ్డాయి. నిజానికి, ఇదంతా మోడీ బలం అనుకుంటే పొరపాటే. విపక్షాల చేతకానితనమే, అధికార పక్షం బలం ఎప్పుడైనా. అదే ఈక్వేషన్ మోడీ ప్రభుత్వానికీ అప్లయ్ అవుతుంది.

ఇక, కరోనా పాండమిక్ విషయానికొస్తే, మోడీ సర్కార్ అస్సలేమాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని మొదటి వేవ్ నుంచీ విమర్శలు వినిపిస్తున్నాయి. సెకెండ్ వేవ్ నేపథ్యంలో ఆ విమర్శలు మరింతగా పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ విషయంలో రేట్ల తేడా సహా, మందుల కొరత, ఆక్సిజన్ సమస్యలు.. పెరుగుతున్న కేసులు, మరణాలు.. ఇవన్నీ మోడీ సర్కార్ పట్ల ప్రజల్లో అనుమానాలు, వ్యతిరేకత పెరగడానికి కారణమవుతున్నాయి. ‘ఇదంతా విపక్షాల కుట్ర..’ అని ఇప్పుడు మోడీని వెనకేసుకొచ్చే ప్రయత్నం బీజేపీ నేతలు చేసినా, అది వర్కవుట్ అయ్యేలా లేదు.

ఎందుకంటే, దేశం కనీ వినీ ఎరుగని రీతిలో నష్టపోయింది. ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైపోయింది. ఇండియా కోలుకునేదెప్పుడో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. భారతదేశం కంటే చిన్న దేశాలు, భారతదేశం కంటే పెద్ద దేశాలూ కరోనా బారిన పడ్డాయి.. కోలుకున్నాయి. చైనానే తీసుకుంటే, కరోనా వైరస్ విషయంలో ఎలా వ్యవహరించిందో చూశాం. మరి, మనకేమయ్యింది.? మన గొప్ప నాయకుడు మోడీ ఎందుకు ఏమీ చేయలేకపోతున్నట్టు.? అందుకే మోడీ ఫెయిల్డ్ పీఎం.. అని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారిప్పుడు.