Bollywood Beauties : బాలీవుడ్ భామలతో అంత వీజీ కాదు.!

Bollywood Beauties : తెలుగు సినిమా మార్కెట్ బాగా పెరిగింది. ప్యాన్ ఇండియా స్థాయిని దక్కించుకుంది. దాంతో బాలీవుడ్ భామలు తెలుగు సినిమాల్లో నటించేందుకు మక్కువ చూపిస్తున్నారు. అయితే, బాలీవుడ్ భామలతో అంత ఈజీ కాదు, ప్రమోషన్స్ దగ్గర్నుంచి డేట్స్ అడ్జస్ట్‌మెంట్ వరకూ వాళ్ల ఈక్వేషన్స్ వేరేలా వుంటాయ్.

దీపికా పదుకొనె, అలియా భట్.. ఇలా పలువురు హిందీ భామలు తెలుగులో సందడి చేయబోతున్నారు. అయితే, అక్కడి సినిమాలతో ఫుల్ బిజీగా వున్న ఈ ముద్దుగుమ్మలు ఇక్కడ సందడి చేయడం అంత తేలికైన విషయం కాదు.

పూజా హెగ్దేకి హిందీలో ఆఫర్లు వస్తున్నప్పటికీ, ఈ కారణంగానే వదిలేసుకోవల్సి వస్తోంది. తెలుగు సినిమాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోంది. అలాగే ముందు ముందు రష్మికా మండన్నా కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కోవల్సి రావచ్చు.

కైరా అద్వానీ తెలుగులో స్టార్‌డమ్ దక్కించుకున్నప్పటికీ, బాలీవుడ్‌లో బిజీ  అయ్యాకా తెలుగు సినిమాలను వదులుకోవల్సివచ్చింది. మళ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత చరణ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతోంది.

ఆల్రెడీ ‘సాహో’తో శ్రద్ధాకపూర్ తెలుగు ప్రేక్షకుల్ని పలకకరించినప్పటికీ, ఆ తర్వాత కొనసాగించలేకపోయింది. ప్రస్తుతం సమంత తదితర ముద్దుగుమ్మలు కూడా ఈ సమస్యల్ని ఫేస్ చేస్తున్నారు.

చూడాలి మరి, ముందు ముందు అలియా భట్, దీపికా పదుకొనె తదితర బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా మ్యానేజ్ చేస్తారో.