Bheemla Nayak : “భీమ్లా నాయక్” ని మరీ అంత చిన్న సినిమాగా కుదించేసారా? నిడివి ఎంతసేపు అంటే!

Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా నిత్యా మీనన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్లులుగా నటిస్తున్న లేటెస్ట్ మాస్ చిత్రం “భీమ్లా నాయక్” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని చిత్ర బృందం ఇప్పుడు శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే ఈ సినిమాని మేకర్స్ ఒరిజినల్ గా మలయాళ హిట్ సినిమా అయ్యప్పనం కోషియం నుంచి రీమేక్ గా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

మరి దాని కోసం తెలిసిన వారు ఈ సినిమా కోసం మరింత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే తెలుగులో దర్శకుడు సాగర్ కే చంద్ర చాలా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తుండగా ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అంశం సినీ వర్గాల్లో వైరల్ అవుతుంది. ఈ సినిమా ఒరిజినల్ గా దాదాపు మూడు గంటలు ఉంటే తెలుగులో చాలా తక్కువ వ్యవధి కి కట్ చేశారట. చెబితే నమ్మరు కానీ భీమ్లా నాయక్ సినిమా కేవలం 2 గంటల 10 నిమిషాలే ఉంటుందట.

ఇది చాలా తక్కువ నిడివే అని చెప్పాలి. కానీ సినిమాలో దాదాపు ఆరేడు పాటలు ఉన్నాయని టాక్. ఇక వీటన్నింటితో కథ చెబుతూ సినిమా ఎప్పటికి అయ్యేది? దీనికి కారణం కూడా త్రివిక్రమ్ అని తెలుస్తోంది. మరి మరీ 130 నిమిషాల సినిమానే అంటే అసలు చూసినట్టు ఉంటుందో లేదో చూడాలి. మరి ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా బ్రహ్మానందం, వివి వినాయక్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.