Too Funny, YSRCP Shivering Against BJP?. ఎక్కడా ఆ పార్టీకి డిపాజిట్లు కూడా వచ్చిన దాఖలాల్లేవు. కానీ, అధికార వైసీపీని ఢీకొంటామంటోంది కమలదళం.
బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తాజాగా చాలా పెద్ద కామెడీ చేసేశారు. బీజేపీ నిర్వహించిన జనాగ్రహ సభ విజయవంతం కావడంతో వైసీపీ వెన్నులో వణుకు పుడుతోందన్నది జీవీఎల్ చేసిన కామెడీ తాలూకు సారాంశం. కామెడీ కాకపోతే ఎమనాలి దీన్ని.?
వైసీపీ ఏంటి.? బీజేపీకి భయపడటమేంటి.? ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని చూసే వైసీపీ భయపడటంలేదు. అసలు, వైసీపీకి రాష్ట్రంలో సరైన రాజకీయ ప్రత్యర్థే లేనప్పుడు ఆ పార్టీ ఎందుకు భయపడాలి.?
బీజేపీ విషయానికే వద్దాం. 2014 నుంచి 2021 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసింది.? ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ఎగ్గొట్టారు. పోలవరం ప్రాజెక్టు ఏడున్నరేళ్ళయినా పూర్తి కాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలా విషయాల్లో బీజేపీ, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పుకునే పరిస్థితుల్లోనే లేదు.
బీజేపీ కొత్త పల్లవి అందుకుందండోయ్.. బెయిల్ మీదున్న నాయకులు జైలుకు వెళతారని. అలా కలలు కనడం తప్ప బీజేపీ చెయ్యగలిగిందేమీ లేదు. బీజేపీ అధినాయకత్వం వైసీపీతో కాస్త సానుకూలంగానే వుంది. ఏపీ బీజేపీ నేతలే, ఎగిరెగిరిపడుతున్నారు.
ఒహో, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించిన 50 రూపాయలకే చీప్ లిక్కర్ పథకం తమకు బీభత్సమైన ఓటు బ్యాంకుని తెచ్చేస్తుందని ఏపీ కమలనాథులు భావిస్తున్నారేమో.!