భర్తల కన్నా ఎక్కువ సంపాదిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు వీళ్లే?

మన టాలీవుడ్ హీరోలు ఒక్కో సినిమాలు కళ్లు చెదిరే స్థాయిలో పారితోషికం తీసుకుంటూ పారితోషికం విషయంలో ఇతర ఇండస్ట్రీలలోని హీరోలతో పోల్చి చూస్తే గొప్ప స్థానాలలో ఉన్నారు. అయితే కొంతమంది హీరోల కంటే ఆ హీరోల భార్యలు ఎక్కువ మొత్తం సంపాదిస్తుండటం గమనార్హం. సినిమాలకు దూరంగా ఉన్నా తమ టాలెంట్ తో ఈ హీరోల భార్యలు ఎక్కువ మొత్తం సంపాదిస్తున్నారు.

నాని భార్య అంజన కాస్టింగ్ డిజైనర్ గా పని చేస్తూ ప్రతి నెలా ఊహించని మొత్తాన్ని సంపాదిస్తున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ భార్య ఉపాసన అపోలో ఆస్పత్రులకు సంబంధించి విధులు నిర్వహిస్తుండగా ఈమె సంపాదన కళ్లు చెదిరే రేంజ్ లో ఉంటుందని సమాచారం అందుతోంది. అల్లరి నరేష్ భార్య ఈవెంట్ మేనేజర్ గా పని చేస్తుండగా ఈమె ఆదాయం కూడా ఊహించని స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది.

బన్నీ భార్య స్నేహారెడ్డి చాలా టాలెంటెడ్ అనే సంగతి తెలిసిందే. స్నేహారెడ్డి పలు మ్యాగజైన్లకు ఎడిటర్ గా వ్యవహరించడంతో పాటు తండ్రి బిజినెస్ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజీవ్ కనకాల భార్య సుమ సంపాదన కూడా ఊహించని స్థాయిలో ఉంది. సుమ టీవీ షోల ద్వారా, సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఊహించని స్థాయిలో సంపాదిస్తున్నారు.

రాజశేఖర్ భార్య జీవిత పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఆదాయం పెంచుకుంటున్నారు. నందు భార్య గీతామాధురి సినిమాల ద్వారా బాగానే సంపాదిస్తున్నారని బోగట్టా. మహేష్ భార్య నమ్రత వ్యాపారాల ద్వారా కళ్లు చెదిరే మొత్తాన్ని సంపాదిస్తున్నారని సమాచారం. ఈ విధంగా టాలీవుడ్ హీరోలతో పోల్చి చూస్తే హీరోల భార్యల ఆదాయం ఎక్కువ మొత్తంగా ఉంది.