స్టార్ హీరోలంతా ఆ ముగ్గురు దర్శకులని ఆడేసుకుంటున్నారు

Tollywood star directors facing pressure from stars

Tollywood star directors facing pressure from stars

తెలుగు ఇండస్ట్రీలో కొత్త దర్శకులు వస్తున్నా కూడ ఆ ముగ్గరు దర్శకులకే ఎక్కువ డిమాండ్ ఉంటోంది. వారికోసమే స్టార్ హీరోలు పోటీపడుతున్నారు. మాతో చేయండి అంటే మాతో చేయండి అంటూ వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చేస్తున్నారు. వాళ్ళే కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్. రాజమౌళి వీళ్లందరినీ మించిన దర్శకుడే అయినా స్టార్ హీరోల జాబితాలో ఆయన ఉండరు. ఎందుకంటే జక్కన్న దగ్గరే హీరోల లిస్ట్ ఉంటుంది కాబట్టి. అందుకే ఈ ముగ్గురు డైరెక్టర్ల మీదనే స్టార్ హీరోల భారమంతా పడింది. పెద్ద స్థాయిలో సినిమాలు చేయాలనుకుంటున్న హీరోలు వీరితోనే వర్క్ చేయాలని అనుకుంటున్నారు. వీళ్లయితే తమ శైలిని ఇట్టే పట్టుకోగలరనే నమ్మకం వారికి.

గత కొన్నిరోజులుగా ఎన్టీఆర్, మహేష్ బాబుల మధ్యన త్రివిక్రమ్, కొరటాల శివలు ఎంతలా నలిగిపోతున్నారో చూస్తూనే ఉన్నాం. చివరకు కథ లేకుండానే కొరటాల తారక్ సినిమాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి వచ్చింది. మధ్యలో ఎన్నో ఒత్తిళ్లు, మరెన్నో మొహమాటాలు. సుకుమార్ ముందు కూడ పెద్ద హీరోలు ఆఫర్లు గట్టిగానే ఉన్నాయి. వీరి కోసం పోటీపడుతున్న వారిలో రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడ ఉన్నారు. ఇక కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కోసం కూడ పోటీ ఉంది. ప్రభాస్ సినిమా చేసున్న ఆయన కోసం తారక్, బన్నీలు గట్టిగా ట్రై చేస్తున్నారు.

ఎంతపోటీపడినా ఉన్నది ఆ ముగ్గురే కాబట్టి మన స్టార్లు బయటి దర్శకులను అప్రోచ్ అవ్వక తప్పటర్లేదు. ప్రభాస్ చూస్తే హిందీ డైరెక్టర్ల వైపుకు వెళ్తున్నారు, చరణ్ ఏమో శంకర్ దర్శకత్వంలో సినిమా ఒప్పుకున్నారు.