ఈ టాలీవుడ్ స్టార్ హీరోలలో ఏ హీరో ఎంత కట్నం తీసుకున్నారో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పదుల సంఖ్యలో స్టార్ హీరోలు ఉన్నారు. ఈ హీరోలలో చాలామందికి ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది. అయితే టాలీవుడ్ హీరోలలో చాలామంది హీరోలు ఊహించని మొత్తం కట్నంగా తీసుకున్నారు. ఈ హీరోల పెళ్లి వేడుక కూడా గ్రాండ్ గా జరగడం గమనార్హం. టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఫేమస్ జోడీలలో చరణ్ ఉపాసన జోడీ కూడా ఒకటి. ఇండస్ట్రీలో ఎంతో అన్యోన్యంగా ఉండే జంటగా ఈ జోడీకి పేరుంది.

చరణ్ కు 350 కోట్ల రూపాయలు కట్నంగా ఇచ్చారని సమాచారం. చరణ్ ఉపాసన పెళ్లి వేడుకకు 20 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని సమాచారం అందుతోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి వివాహం 2011 సంవత్సరంలో గ్రాండ్ గా జరిగిందనే సంగతి తెలిసిండే. తారక్ 200 కోట్ల రూపాయలు కట్నంగా తీసుకున్నారని అప్పట్లో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఎన్టీఆర్ లక్ష్మీప్రణతి దంపతులకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు.

మహేష్ నమ్రతల వివాహం చాలా సింపుల్ గా జరిగింది. ఈ వివాహం కోసం కేవలం 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఖర్చు చేశారని సమాచారం. నమ్రత మహేష్ కు కట్నం ఇవ్వకపోయినా ఆమె పేరుపై ఉన్న ఆస్తులను మహేష్ పేరుపై బదిలీ చేశారని బోగట్టా. న్యాచురల్ స్టార్ నానికి కట్నంగా 3 కోట్ల రూపాయలు దక్కాయని సమాచారం. నాని పెళ్లికి 40 లక్షల రూపాయలు ఖర్చైందని తెలుస్తోంది.

ఆది సాయికుమార్ అరుణ అనే యువతిని వివాహం చేసుకోగా ఆదికి 2 కోట్ల రూపాయలు కట్నంగా దక్కిందని బోగట్టా. టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరైన గోపీచంద్ రేష్మ అనే యువతిని వివాహం చేసుకున్నారు. అయితే గోపీచంద్ రేష్మల పెళ్లికి కోటిన్నర రూపాయలు ఖర్చు అయిందని ఎనిమిది కోట్ల రూపాయలు గోపీచంద్ కు కట్నంగా దక్కిందని సమాచారం. టాలీవుడ్ హీరోలు తమ రేంజ్ కు అనుగుణంగా రెమ్యునరేషన్లను తీసుకున్నారు.