RRR సినిమా అస్సలు నచ్చలేదన్న టాలీవుడ్ హీరోయిన్

డైరెక్టర్ రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత అంతకంటే ఎక్కువ బడ్జెట్ తో, కాస్టింగ్ తో తీసిన సినిమా RRR . ఈ సినిమాకు ప్రపంచం మొత్తం నుండి ప్రశంశలు వచ్చాయి, అలాగే ఆస్కార్ కి వెళ్తుంది అనే వార్తలు వచ్చాయి కానీ ఈ సినిమా ఆస్కార్ కి ఎంపిక కాలేదు. సినిమా ఎంత హిట్ అయినా కానీ ‘బాహుబలి’ కలెక్షన్స్ మాత్రం దాటలేకపోయింది, ఆ రేంజ్ సినిమా కాదు అని చాలా మంది అభిప్రాయం కూడా.

తాజాగా RRR సినిమా గురించి హీరోయిన్ నికీషా పటేల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్ ‘కొమరం పులి’, అలాగే కళ్యాణ్ రామ్ ‘ఓం’ లాంటి సినిమాల్లో నటించిన నికీషా, ఆ తర్వాత తమిళ్ లో తన లక్ చెక్ చేసుకుంది. ఎక్కడా సరైన హిట్ లేకపోవడంతో బ్రిటిష్ తిరిగి వెళ్ళిపోయింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది నికీషా. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన ఈమె తనకు ఈ సినిమా నచ్చలేదని తనకు ఈ సినిమా నచ్చలేదని విషయాన్ని తాను ధైర్యంగా ట్వీట్ చేస్తున్నా అంటూ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అందరికి నచ్చిన సినిమా తనకు కూడా నచ్చాలని లేదని నికీషా కామెంట్ చేసింది.