Samantha: సినీనటి సమంత తన వ్యక్తిగత కారణాల వల్ల గత కొద్ది రోజులుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు ఈమె నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఆ డిప్రెషన్ నుంచి బయటపడి వరుస సినిమాలకు కమిట్ అయ్యారు అయితే ఆ తరుణంలో ఈమె మయోసైటిసిస్ వ్యాధికి గురి అయ్యారు. ఇలా ఈ వ్యాధి కారణంగా పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
ఇప్పుడిప్పుడే సమంత ఈ వ్యాధి నుంచి బయటపడటంతో తిరిగి వెబ్ సిరీస్ లకు కమిట్ అవుతున్నారు. ఇక ఈమె చివరిగా సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఇటీవల మరో వెబ్ సిరీస్ కి కూడా కమిట్ అయ్యారు. ఇదిలా ఉండగా వెండితెరపై సమంత ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఈ సినిమా ఈమెకు తెలుగులో చివరి సినిమాగా అని చెప్పాలి ఇప్పటివరకు మరో సినిమా ద్వారా సమంత ప్రేక్షకుల ముందుకు రాకపోవడంతో అభిమానులు కూడా ఈమె కొత్త సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే సమంత అభిమానుల కోరిక నెరవేరుస్తుందని చెప్పాలి. ఇదిలా ఉండగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటుంది నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను ఈమె అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలోనే తాజాగా సమంత సోషల్ మీడియాలో వైట్ కలర్ డ్రెస్ ధరించి ఉన్నటువంటి కొన్ని క్యూట్ ఫోటోలను షేర్ చేశారు. ఇక ఈ ఫోటోలకు వచ్చే 6 నెలల పాటు నేను నవ్వుతూ ఉంటాను అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇలా సమంత నేను నవ్వుతూనే ఉంటాను అంటూ క్యాప్షన్ పెట్టడంతో అభిమానులు ఈ పోస్ట్ పై స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు మీరు ఎప్పుడు అలాగే నవ్వుతూ ఉండాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.