ఘోస్ట్ సినిమాను వదులుకున్న టాలీవుడ్ హీరో

నాగార్జున కొన్నాళ్లుగా కాప్ సినిమాల మీద బాగా ఇంటరెస్ట్ చూపిస్తున్నాడు. ‘ఆఫీసర్’, ‘వైల్డ్ డాగ్’ లాంటి సినిమాలు నిరాశపరచడంతో ఇంకోసారి ‘ది ఘోస్ట్’ అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. నిన్న దసరా సందర్భంగా రిలీజ్ అయినా ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు పోతుంది. అయితే ఈ సినిమాఘోస్ట్ సినిమాను వదులుకున్న టాలీవుడ్ హీరోకు మొదట అనుకున్న హీరో నాగార్జున కాదంట.

డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు మొదట ఈ కథను నాగ చైతన్య కు వినిపించాడట, అయితే ఆ రోల్ తనకు సెట్ అవ్వదని నాగ చైతన్య అనడంతో నాగార్జున ఇంప్రెస్స్ అయ్యి ఈ సినిమాకు కమిట్ అయ్యాడు. అంతే కాకుండా ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట మెహ్రీన్ ని అనుకున్నారు. అయితే బికినీ వేసుకోవాల్సి ఉంటుంది, అలాగే  చాలా సన్నివేశాల్లో బోల్డ్ గా నటించాల్సి ఉంటుందని  మెహ్రీన్ ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

అలాగే హీరోయిన్ గా శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ను కూడా అనుకున్నారట. కానీ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ ఉండడం వల్ల జాక్వెలిన్ ఈ సినిమాను మిస్ చేసుకుంది. ఆఖరికి సోనాల్ చౌహన్ కి ఛాన్స్ దక్కింది.