Bunny-Nani: బన్నీ అరెస్ట్ పై స్పందించిన నాని.. ఇది మనందరి తప్పు అంటూ!

Bunny-Nani: టాలీవుడ్ హీరో ఐకాన్ సార్ అల్లు అర్జున్ అరెస్ట్ విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అల్లు అర్జున్ అరెస్టుతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. ఇప్పటికే చాలామంది అల్లు అర్జున్ అరెస్టు ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ మేరకు అల్లు అర్జున్ అరెస్ట్ పై ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందించిన విషయం తెలిసిందే.. తాజాగా బన్నీ అరెస్టుపై టాలీవుడ్ హీరో, న్యాచురల్ స్టార్ నాని సైతం స్పందించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఈ విధంగా రాసుకొచ్చారు. ఈ సందర్భంగా నాని స్పందిస్తూ.. సినిమా వాళ్లకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు, మీడియా చూపించే ఉత్సాహం సాధారణ పౌరులపై కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మనం మంచి సమాజంలో జీవించాలి. అదొక దురదృష్టకర, హృదయ విదారక ఘటన.

దీని నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. ఇకపై మరిన్ని జాగ్రత్తలు పాటించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మనందరి తప్పు ఉంది. ఒక వ్యక్తిని నిందించడం కరెక్ట్‌ కాదు అని నాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాని చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. నాని చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులు స్పందిస్తూ నానికి థాంక్స్ చెబుతూనే నాని చేసిన ట్వీట్ కి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.