రామ్ చరణ్ మనసు ఎంతో గొప్పది.. చరణ్ పై ప్రముఖ కమెడియన్ ప్రశంసల వర్షం?

మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్ చిరుత సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. రామ్ చరణ్ నటించిన మొదటి సినిమాతోనే హీరోగా ప్రేక్షకులలో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. రామ్ చరణ్ నటించిన మగధీర సినిమా ద్వారా అతని క్రేజ్ మరింత పెరిగిపోయింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ గా గుర్తింపు పొందాడు. ఇటీవల మరొక సారి రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించాడు. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమా ద్వారా ఇద్దరు పాన్ ఇండియా హీరోలుగా మంచి గుర్తింపు పొందారు.

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ విమర్శకుల ప్రశంసల సైతం అందుకున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమృత్ సర్ లో జరుపుకుంటోంది. ఇటీవలే ఇక్కడ రామ్ చరణ్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ ఒక స్టార్ హీరోగా మాత్రమే కాకుండ, చిరంజీవి కొడుకైన కూడా చాలా ఒదిగి ఉంటాడు. ఇప్పటికే ఇదే విషయాన్ని ఇండస్ట్రీ చాలా మంది అంటూ ఉంటారు. చరణ్ వ్యక్తిత్వం గురించి అతని మంచి మనసు గురించి సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటారు. తాజాగా కమెడియన్ సత్య చరణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమాలో కమెడియన్ సత్య కూడా ఒక పాత్రలో నటిస్తున్నాడు. రామ్ చరణ్ తో పాటు కమెడియన్ సత్యా కూడా అమృత్ సర్ లో జరిగిన షూటింగ్ లో పాల్గొన్నారు. ఇటీవల సత్య కూడా తన షూటింగ్ ముగించుకొని హైదరాబాద్ తిరిగి రావలసి ఉండగా రామ్ చరణ్ కూడా తన షూటింగ్ ముగించుకొని హైదరాబాద్ కి పయనమయ్యారు. అయితే సత్య విషయం తెలుసుకున్న రామ్ చరణ్ కమెడియన్ సత్య ని తన సొంత విమానంలో హైదరాబాద్ తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో కమీడియన్ సత్యా కూడా రామ్ చరణ్ మంచి మనసు గురించి చెబుతూ పొగడ్తలతో ముంచేశాడు