Bangarraju : టాలీవుడ్ బాక్సాఫీస్ : “బంగార్రాజు”కి అంత సీన్ ఉందా? భారీ బిజినెస్ నే జరిపాడు.!

Bangarraju :  అసలు ఈ సంక్రాంతి పండగ కానుకగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఏవో సినిమాలు వస్తాయి అనుకుంటే ఇంకేవో సినిమాలు వస్తున్నాయి దీనితో టాలీవుడ్ మూవీ లవర్స్ బాగా డీలా పడిపోయారు. అయితే మరి ఈ రేసులో కాస్త కొద్దో గొప్పో ఫ్యామిలీ అంతా థియేటర్స్ లో చూడదగ్గ సినిమా ఏదన్నా ఉంది అంటే అది కింగ్ నాగార్జున మరియు కొడుకు నాగ చైతన్య లు కాంబోలో వస్తున్న సినిమా “బంగార్రాజు” అని చెప్పాలి.

ఇదే సంక్రాంతి బరిలో వచ్చి సూపర్ హిట్ కొట్టిన “సోగ్గాడే చిన్ని నాయన” సినిమాకి సీక్వెల్ గా ఇది వస్తుంది. అయితే మంచి అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి కానీ ఈ సినిమాకి జరిగిన బిజినెస్ లెక్కలు వింటే షాక్ అవ్వాల్సిందే అని చెప్పాలి. ఒక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా 30 కోట్ల మేర బిజినెస్ జరిపిందట. మరి ఇందులో ఒక్క నైజాం లోనే 11 కోట్లు జరిగిందట.

ఇవన్నీ చూస్తుంటే బంగార్రాజు పెద్ద టార్గెట్ తోనే వస్తున్నాడు. కానీ ఈ పరిస్థితి లో సినిమా అంత మొత్తం రాబడుతుందా అనేది ఆసక్తిగా మారిన ప్రశ్న. నాగ్ కి ఉన్న మార్కెట్ అంతంత మాత్రమే అయినా సినిమా ఏదొక మ్యాజిక్ చేస్తే తప్ప పూర్తి స్థాయిలో ఈ సినిమా ఇంత రాబట్టడం కష్టం. మరి ఈ సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర బంగార్రాజు ఎంత రాబడతాడో చూడాలి. ఇక ఈ సినిమాని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అలాగే మొత్తం 8మంది హీరోయిన్ లు ఈ సినిమాలో కనిపిస్తారని టాక్ ఉంది.