‘వకీల్ సాబ్’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్

Time fixed for Vakeel Saab trailer

Time fixed for Vakeel Saab trailer

పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘వకీల్ సాబ్’. పవన్ రీఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ హైప్ ఉంది. ఈమధ్యే సినిమా ప్రమోషన్లు మొదలుపెట్టారు. త్వరలో భారీ లెవల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు 2 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు దిల్ రాజు. ఈ వేడుకకు చిరంజీవి, రామ్ చరణ్ హాజరుకానున్నారు. ఇక అభిమానులైతే ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం మేరకు దీనికి కూడ టైమ్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం డేట్, టైమ్ రివీల్ చేయనున్నారట.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు 29వ తేదీన సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తారని అంటున్నారు. దీంతో సాయంత్రం నిర్మాతల నుండి ఏ అప్డేట్ వస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా మీదున్న హైప్ కారణంగా బిజినెస్ కూడ భారీగానే జరిగిందట. సినిమా టార్గెట్ 100 కోట్ల పైమాటే అంటున్నారు. మొదటి రోజు సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే 100 కోట్లు పెద్ద లెక్క కాదని, వారంలో వసూలవుతుందని, మూడు వారాలపాటు సినిమా గనుక రన్ అయితే 150 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది.