Tiktok DurgaRao: పుష్ప డైలాగ్ తో తగ్గేదేలే.. అంటున్న టిక్ టాక్ దుర్గారావు.. వైరల్ అవుతున్న వీడియో..!

Tiktok DurgaRao: టిక్ టాక్ పుణ్యమా అని ఎంతోమంది తమలో దాగివున్న టాలెంట్ ని బయటకు తీస్తున్నారు . టిక్ టాక్ యాప్ ద్వారా ఎంతోమంది రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోయారు. అలాంటి వారిలో దుర్గారావు కూడా ఒకరు. దుర్గారావు టిక్ టాక్ లో తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో అభిమానులను ఆకట్టుకోవడంలో ముందంజలో ఉన్నారు. తన డాన్స్ పర్ఫామెన్స్ ద్వారా ఎంతోమంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు . అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా తాజాగా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే . ఈ సినిమాలోని డైలాగ్స్ ఎంతో పాపులర్ అయ్యాయో ప్రస్తుతం దుర్గారావు కూడా పుష్ప సినిమాలోని తగ్గేదేలే అనే డైలాగ్ తనదైన రీతిలో చెప్పుకొచ్చారు .

టిక్ టాక్ స్టార్ దుర్గా రావు తన భార్యతో కలిసి చేసే డాన్స్ పర్ఫార్మెన్స్ ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు . పలాస సినిమా లోని “మీ బావగారు వచ్చేటి వేళ” అనే పాటకు డాన్స్ చేసి తన పాపులారిటీ మరింత పెంచుకున్నారు . ఈ డాన్స్ వీడియో తర్వాత దుర్గా రావుకు టీవీ షోస్ లో కూడా నటించే అవకాశం వచ్చింది . టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన దుర్గారావు తాజాగా పుష్ప సినిమాలోని ” పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదేలే.. పుష్ప అంటే ఫ్లవరనుంకుంటివా.. ఫైరో ” అంటూ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌ను ఇమిటేట్ చేసిన వీడియో తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు . ఆ వీడియోను చూసిన నెటిజెన్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయిపోతున్నాయి .

ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన రీతిలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు . ఈ వీడియోకు వేలకు పైగా లైక్ రాగా.. కామెంట్స్ మాత్రం భారీగా వస్తున్నాయి . కొందరు బాగుంది అంటుంటే , మరికొందరు నెటిజెన్స్ మాత్రం ఈ వీడియో పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు . ఎక్కడ దొరికారంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. దయచేసి ఈ వీడియో డిలీట్ చేయండి అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశారు. మరికొందరైతే అల్లు అర్జున్ పరువు తీయకండి రా బాబు అంటూ కామెంట్స్ చేశారు . ఎవరు ఎలా చేసినా దుర్గారావు మాత్రం తనదైన శైలిలో వీడియోలు చేస్తూ అందరికీ వినోదాన్ని పంచుతున్నాడు.