ఈ కారణంతో పవన్ కీలక అప్డేట్ వాయిదా.!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో యంగ్ దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న మాస్ మసాలా చిత్రం “భీమ్లా నాయక్” ఒకటి. మళయాళ బ్లాక్ బస్టర్ అయ్యప్పనం కోషియం కి రీమేక్ గా త్రివిక్రమ్ సారథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. మరి ఇప్పుడు ఎట్టకేలకు చివరి దశ షూటింగ్ కి వచ్చేసిన ఈ చిత్రం నుంచి నిన్ననే చిత్ర బృందం సినిమాలో ఆయువు పట్టు లాంటి సాంగ్ ని రిలీజ్ చెయ్యడానికి ఈరోజు టైం ఫిక్స్ చేశారు.

కానీ నిన్న రాత్రే ఊహించని విధంగా ఈ కీలక అప్డేట్ ని వాయిదా వేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. అయితే దీనికి కారణం తెలుస్తుంది. నిన్ననే తెలుగు సాహిత్య రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కన్ను మూసారు. పైగా వారి కుటుంబానికి ఈ సినిమా నిర్మాతలకు ఎంతో సాన్నిహిత్యం ఉంది అందుకే ఈ సమయంలో ఇలాంటి అప్డేట్ లు విడుదల చెయ్యడం సరైన పని కాదని భావించి వాయిదా వేసారట. దీనితో ఈ నిర్ణయానికి పవన్ అభిమానులు కూడా అడ్డు చెప్పలేదు.