Megastar Is Number 1 : సీనియర్ హీరోస్ లో చిరుని ఎందుకు నెం.1 అంటారో “ఆచార్య”తో మళ్ళీ ప్రూవ్.!

Megastar Is Number 1 : మన తెలుగు సినిమా దగ్గర ఎందరో బిగ్గెస్ట్ స్టార్ట్ హీరోస్ ఉండొచ్చు కానీ మెగాస్టార్ మాత్రం ఒకరే. తెలుగు సినిమా దగ్గర తన కృషి గాని సినిమాల ట్రాక్ రికార్డు కానీ మరే హీరోలకి లేదు. తాను హీరోగా మారినప్పటి నుంచి ఇప్పటికీ తన సినిమాలతో ఏ తరానికి తగ్గట్టు ఆ తరపు కాంపిటేషన్ ఇవ్వడం అనేది ఒక్క మెగాస్టార్ చిరంజీవికే చెల్లుతుంది అని చెప్పాలి.
అయితే తాను హీరోగా స్థిరపడిన కాలంలో బాలయ్య, నాగ్, వెంకటేష్ లలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది మాత్రం చిరంజీవినే అని అందరికీ తెలిసిందే. రాజకీయాల్లోకి వెళ్లి ఆ స్థానంలోకి అప్పుడు యంగ్ హీరోలు వచ్చారు. అయితే మళ్ళీ వచ్చాక కూడా మెగాస్టార్ ఏకంగా నాన్ బాహుబలి రికార్డులు సెట్ చేసి తన బాక్సాఫీస్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని షాకిచ్చారు.
అయితే ఈ సీనియర్ హీరోస్ లో ఒక్క మెగాస్టార్ తప్ప బాక్సాఫీస్ దగ్గర మిగతా హీరోలు అంతా సోలో సినిమాలతో స్ట్రగుల్ అవుతున్నారు. బాలయ్యకి కూడా సరైన సినిమా మంచి దర్శకుడుతో పడకపోతే ఓపెనింగ్స్ కూడా లేని పరిస్థితి ఇది ఒప్పుకొని తీరాలి.
అయినా ఇవేవి లేకున్నా చిరు ఇప్పటికీ రికార్డు ఓపెనింగ్స్ సెట్ చెయ్యగలడు.
అయితే మన సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో వారి టీజర్ ట్రైలర్స్ కి కొన్ని ఆల్ టైం రికార్డ్స్ అందుకోవడంలో కూడా గట్టి పోటీ ఉంది. మరి ఈ లిస్ట్ లో తన “ఆచార్య” సినిమాతో ఫస్ట్ టైం 1 మిలియన్ లైక్స్ సాధించిన ట్రైలర్ గా మెగాస్టార్ ఫస్ట్ రికార్డు గా మన సీనియర్ హీరోల్లో ఫస్ట్ హీరోగా నిలిచారు.
దీనితో ఆ సీనియర్ హీరోస్ లో తననే ఎందుకు నెంబర్ 1 హీరోగా చేసారో దీనితో మళ్ళీ ప్రూవ్ అయ్యినని చెప్పాలి.