KGF Chapter 2 : “కేజీఎఫ్” నుంచి ఆ నటుడు ఎందుకు తప్పుకున్నాడో తెలిసిపోయింది.!

KGF Chapter 2 : కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్న భారీ సినిమా “కేజీఎఫ్ చాప్టర్ 2” కోసం ఇప్పుడు ఆడియెన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే.
అయితే దీని కన్నా ముందు మొదటి భాగం కోసం మాట్లాడుకున్నట్టు అయితే ఆ సినిమాలో భారీ ఎలివేషన్స్ చూసి అన్ని భాషల్లో ఆడియెన్స్ కూడా షాక్ అయ్యారు.
ముఖ్యంగా సినిమాలో కథని ముందుకు తీసుకెళ్లే జర్నలిస్ట్ ఆనంద్ వాసి రాజు పాత్ర ఎంత బలంగా ఉంటుందో చూసాము. అయితే ఆ పాత్రని ప్రముఖ సీనియర్ నటుడు అనంత్ నాగ్ సూపర్బ్ గా చెయ్యడం అందులోని మన తెలుగు డబ్బింగ్ లో మరింత స్థాయిలో ఎలివేట్ అయ్యాయి.
అయితే సడెన్ గా ఈయన ఈ సినిమా రెండో  నటుడు ప్రకాష్ రాజ్ పోషిస్తున్నారని టాక్ బయటకి వచ్చింది. దీనిపై ఆ మధ్య ఎవరూ సరిగ్గా సమాధానం ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఫైనల్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడాడు.
ఈ సినిమా నుంచి అనంత్ నాగ్ తప్పుకున్న మాట నిజం అని దానిని ప్రకాష్ రాజ్ గారే చేసారని చెప్పారు.
అయితే ఆయన సినిమా నుంచి స్వతహాగా తప్పుకున్నారని మేము అయితే తీయాలి  అనుకోలేదని అది ఆయన ఇష్ట ప్రకారం జరిగింది అని తుది క్లారిటీ ని తాను ఇచ్చారు. మరి ఈ సినిమాలో కన్నడ రాకింగ్ హీరో యష్ నటించగా హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించింది.
అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ అధీరా పాత్రలో నటించారు.