Acharya : “ఆచార్య” పాన్ ఇండియా రిలీజ్ ఇందుకు ఆగిపోయిందట..కానీ..!

Acharya :  మరికొన్ని రోజుల్లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న మరో భారీ సినిమా “ఆచార్య” కోసం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా నటించిన ఈ సినిమాని కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా కోసం సెన్సేషనల్ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమా విషయంలో మెగాస్టార్ ఒక ప్లాన్ చేసుకున్నారని కానీ అది మళ్ళీ ఆగిపోయింది అని ఆల్రెడీ చెప్పుకున్నాము. అయితే ఇపుడు అసలు దీనికి గల కారణం ఏమిటో తెలుస్తుంది. కాదు కన్ఫర్మ్ గా తెలిసింది. ప్రస్తుతం తెలుగు సినిమాలు హిందీలో కూడా రిలీస్ అవుతున్నా అందులో భాగంగా ఈ సినిమాని కూడా ప్లాన్ చేశామని రామ్ చరణ్ తెలిపాడు.
కాకపోతే తన ట్రిపుల్ ఆర్(RRR) సినిమాకి దీనికి పెద్దగా గ్యాప్ లేకపోవడంతో నిర్మాతగా ఆ డబ్బింగ్ ఇతర పనులు చేయలేకపోయాము అని అందుకే రిలీజ్ ఆగింది అని తాను తెలిపాడు. ఇంకా తాను శంకర్ సినిమాలో కూడా బిజీగా ఉండడం మరో కారణం అని తెలిపాడు. కానీ…
ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ఉండదా అంటే ఉందనే చెప్తున్నాడు. కాకపోతే అది మరో రెండు మూడు నెలల్లో ఉండొచ్చని మాత్రం క్లారిటీ ఇచ్చాడు. అలాగే ఇంకో విషయం తాను మాత్రమే తన సినిమాకి డబ్బింగ్ చెబుతానని సినిమా లేట్ అవ్వడానికి అది కూడా ఇంకో కారణం అని తెలిపాడు. అంటే ఆచార్య హిందీ సహా ఇతర భాషల్లో చరణ్ వాయిస్ లోనే రిలీజ్ ఉంటుంది అని చెప్పాలి.