pawan kalyan : గాసిప్స్ : ఈ రెండు సినిమాలు పట్ల పవన్ ప్లానింగ్ ఇలా ఉందంట.!

pawan kalyan :  టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దీనితో తాను చేసే సినిమాలకి భారీ డిమాండ్ నెలకొంటుంది. అలా లేటెస్ట్ గా అయితే “భీమ్లా నాయక్” కి మాసివ్ ఓపెనింగ్స్ దక్కడంతో పాటుగా పవన్ మొదటి సారి 100 కోట్ల షేర్ ని అందుకున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత పవన్ చెయ్యాల్సిన సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిలో రీసెంట్ గా పవన్ తన కెరీర్ లోనే మోస్ట్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ “హరిహర వీరమల్లు” రీ స్టార్ట్ చేసాడు.
దీనితో మళ్ళీ పవన్ సినిమాల్లో బిజీ అయ్యినట్టు అయ్యింది. అయితే సినీ వర్గాల్లో పవన్ సినిమాలకి సంబంధించి కీలక ప్లానింగ్ వివరాలు తెలుస్తున్నాయి.
దీని ప్రకారం అయితే ఇప్పుడు చేస్తున్న హరిహర వీరమల్లు అలాగే దర్శకుడు హరీష్ శంకర్ తో చేసే ఇంకో క్రేజీ ప్రాజెక్ట్ “భవదీయుడు భగత్ సింగ్” షూటింగ్ లను పవన్ ఇలా ప్లాన్ చేస్తున్నాడట.
మొదట కంప్లీట్ గా క్రిష్ సినిమాపై ఫోకస్ పెట్టి దాన్ని పూర్తి చేసేయ్యాలని చూస్తున్నారట.
ఇంకా చెప్పాలంటే దసరా రిలీజ్ కి సినిమా రెడి అయ్యిపోయేలా ప్లాన్ చేస్తున్నారట. అంటే ఈ లెక్కన చాలా త్వరగానే ఈ సినిమా ఫినిష్ అయ్యిపోయేలా చేయనున్నారని చెప్పాలి.
ఇక హరీష్ తో సినిమా విషయం కి వస్తే దీనిని పవన్ ముందు తాను లేని సీన్స్ ని తీసేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీనితో ఈ షూటింగ్ వచ్చే జూన్ నెల నుంచే స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది.
అలాగే ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చెయ్యాలని చూస్తున్నారట.
ప్రస్తుతానికి అయితే పవన్ ప్లానింగ్ ఇలా ఉందని తెలుస్తోంది. అయితే ఈ గ్యాప్ లో ఎలాంటి రిమేక్ సినిమాలు కమిట్ కాకపోవడంతో అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా హరిహర వీరమల్లు సినిమాలో హాట్ హీరోయిన్ నిధి అగర్వాల్ నటిస్తుండగా హరీష్ శంకర్ సినిమాలో పూజా హెగ్డే నటిస్తుంది.