Beast Movie : “బీస్ట్” సినిమా చూసిన స్టార్ హీరోయిన్..హర్టైన తెలుగు హీరో ఫ్యాన్స్.!

Beast Movie :  ఈరోజు ఎన్నో అంచనాలు నడుమ విడుదల అయ్యిన భారీ సినిమా “బీస్ట్”. థలపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాగా ఒక్క తమిళ్ మరియు తెలుగు మినహా అన్ని చోట్లా బిలో యావరేజ్ అంచనాలతో రిలీజ్ అయ్యింది.
అయితే విజయ్ సినిమా రిలీజ్ అంటే తమిళ నాట ఆ హంగామా ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. కానీ ఓ సినిమా రిలీజ్ అంటే ఆ సినిమా యూనిట్ కాకుండా వేరే సినిమా స్టార్ లు హీరోయిన్లు సినిమా చూస్తే అది ఆసక్తిగానే ఉంటుంది.
మరి ఈ సినిమా విషయంలో జరిగిన లేటెస్ట్ ఇన్సిడెంట్ పై మన టాలీవుడ్ స్టార్ హీరో అభిమానులు కాస్త హర్ట్ అయ్యారట.
మరి మేటర్ లోకి వెళితే విజయ్ నటించిన బీస్ట్ సినిమాకి అసలు ఆ సినిమాతో సంబంధమే లేని స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తమిళ్ లో తెల్లవారు జాము షో చూడడం ఆసక్తిగా మారింది. దీనితో మహేష్ అభిమానులు ఈ అంశంపై కాస్త హర్ట్ అయ్యారు.
ఈమె మన తెలుగులో సినిమాలు ఎన్నో చేసింది కానీ తెలుగు సినిమాలకి గాని తెలుగు హీరోలకి గాని ఇలా వెళ్లిందా??
పోనీ ఇప్పుడు హీరోయిన్ గా మహేష్ బాబు తో చేస్తున్న “సర్కారు వారి పాట” సినిమాకి అయినా వెళ్తుందా అని అంటున్నారు. అలాగే మరికొందరు అయితే మహేష్ సినిమాకి కూడా ఇలా వెళ్తావా కీర్తి అంటూ ట్యాగ్ చేసి మరీ అడుగుతున్నారు.
అయితే కీర్తీ స్వతహాగా తమిళ అమ్మాయి కావడంతో అలా వెళ్లి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.